మందు బాటిల్​ ఓపెన్​ చేస్తే ఎన్ని రోజుల్లో పూర్తి చేయాలో తెలుసా..

మందు బాటిల్​ ఓపెన్​ చేస్తే ఎన్ని రోజుల్లో పూర్తి చేయాలో తెలుసా..

ప్రస్తుత కాలంలో మద్యం అంటే చాలా చీప్ అయిపోయింది. చిన్న నుంచి పెద్ద వరకు మద్యం తాగుతూ ఉన్నారు. ఇంట్లో చిన్న ఫంక్షన్ నుంచి మొదలు పెద్దపెద్ద కార్యాల వరకు మందులేనిదే ముద్ద దిగని పరిస్థితి ఏర్పడింది. అయితే మద్యం బాటిల్​ ఓపెన్​ చేసిన తరువాత ఎన్నిరోజుల వరకు తాగొచ్చో తెలుసుకుందాం. . . 

వైన్ షాప్స్‌ను చూస్తే చాలు ఎప్పటికీ కళకళలాడుతూ కనిపిస్తాయి. అయితే వైన్ షాప్స్‌లో ఉన్న మద్యం బాటిల్స్ ‌కు ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది.. మందు బాటిల్ ఎన్ని రోజుల వరకు తాగొచ్చు అనే డౌట్ చాలా మందిలో ఉంటుంది.  మద్యం బాటిల్​  ఓపెన్ చేయనిదైతే సంవత్సర కాలాలపాటు పక్కనపెట్టి, తాగితే ఆ మద్యం అద్భుతంగా ఉంటుందని భావిస్తారు. అలాంటి మధ్యానికి కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. 

ఓపెన్ చేసిన మద్యం బాటిల్ ఎన్ని రోజుల వరకు తాగొచ్చు. అనే డౌట్ చాలామంది మెదళ్లలో ఉంటుంది. అసలు విషయంలోకి వెళ్తే.. కొంతమంది మద్యాన్ని లిమిటెడ్ గా తాగుతూ ఉంటారు. లీటర్ ఆపై బాటిల్ తెచ్చుకొని, రోజుకు ఒక చిన్న పెగ్గులెక్కన కొన్ని రోజులపాటు తాగుతూ ఉంటారు.

చాలా మంది వైన్స్‌కు అడెక్ట్ అవుతున్నారు.రోజూ తాగడమే కాకుండా,కొంత మంది బాటిల్ తీసుకొచ్చుకొని రోజుకు కొంచెం కొంచెంగా తాగుతుంటారు.  వైన్ అనేది ఎసిటిక్ యాసిడ్ స్థాయిలను పెంచుతుంది. దీనిని ఓపెన్​ చేస్తే మూడు నుంచి ఐదురోజుల వరకు తాగడానికి అనుకూలంగా ఉంటుంది. ఆతరువాత  వైన్‌.. వెనిగర్‌గా మారుతుంది. 

యువత ఎక్కువగా ఇష్టపడే బీర్ ఎక్స్పైరీ డేట్ కంటే ముందే ముగుస్తుందట. సాధారణంగా బీర్ బాటిల్ గడువు కాలం ఆరు నెలలు. ఇక బీర్ టిన్ లేదా బాటిల్ అయినా.. ఒకసారి ఓపెన్ చేస్తే ఒకటి లేదా రెండు రోజుల్లో పూర్తి చేయాలి. దానిని ఓపెన్ చేసినప్పుడు.. గాలిలోని ఆక్సిజన్ బీర్‌తో సంకర్షణ చెందుతుంది. అలా కాకుండా ఓపెన్ చేసి కొన్ని రోజులపాటు ఉంటే అది ఆక్సిజన్ తో చర్యలు జరిపి చెడువాసన కలుగి ఆరోగ్యం త్వరగా దెబ్బతింటుందని అంటున్నారు.

మద్యం లేనిదే ఇప్పుడు చాలా మంది ఉండటం లేదు. రోజు రోజుకు వైన్‌కు డిమాండ్ పెరుగుతంది. చిన్న మీటింగ్స్ నుంచి మొదలు పెడితే పెద్ద పెద్ద ఫంక్షన్స్ వరకు, ఏదీ లేకున్నా నడుస్తుంది కానీ, మందు లేకుండా ఏ పార్టీస్ జరగడం లేదంటే మద్యం డిమాండ్  ఉందో అర్థం చేసుకోవాలి.  ఈ విధంగా చాలామంది మద్యం తాగి ప్రాణాల మీదికి కూడా తెచ్చుకుంటున్నారు. అలాంటి మద్యాన్ని కొన్ని రోజులపాటు పక్కనబెట్టి తాగితే బాగుంటుందని చాలామంది అంటుంటారు.